రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహారపదార్దాలని తీసుకోవద్దు..!

-

చాలా మంది తెలియక చిన్న చిన్న పొరపాట్లుని ఆహార విషయంలో చేస్తూ ఉంటారు. నిజానికి మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. చిన్న చిన్న తప్పులు వలన పెద్ద సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట ఎక్కువ కారం ఉండే ఆహార పదార్థాలు వంటివి తీసుకుంటే గుండెలో మంట వంటివి కలుగుతూ ఉంటాయి అయితే రాత్రిపూట ఎటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అనే విషయాన్ని ఈరోజు మనం చూసేద్దాం.

ఎక్కువ ఆహారం:

చాలామంది రాత్రి పూట కడుపు నిండా తినేస్తూ ఉంటారు దీని వలన జీర్ణం అవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, కొవ్వు పదార్థాలు జీర్ణం అవ్వడానికి టైం పడుతుంది. దీనితో సమస్యలు వస్తాయి. ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, చీజ్ బర్గర్స్ వంటి వాటిని రాత్రి పూట తీసుకోకండి.

ఆల్కహాల్:

చాలామంది రాత్రిపూట ఆల్కహాల్ ని తీసుకుంటూ ఉంటారు. దీన్ని తీసుకోవడం వలన నిద్ర సరిగ్గా పట్టదు సరి కదా గురక, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు:

నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన రాత్రి పూట పదేపదే లేవాల్సి వస్తుంది దీనితో నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇది మీ ఆరోగ్యం పై ఎఫెక్ట్ చూపిస్తుంది. రాత్రిపూట పుచ్చకాయ, కీరదోస వంటి వాటిని తీసుకోవద్దు.

కెఫిన్:

కెఫిన్ ఉండే వాటిని రాత్రి పూట తీసుకోకండి కాఫీ చాక్లెట్ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి లేదంటే నిద్రలేమి మొదలైన ఇబ్బందులు వస్తాయి.

కారంగా ఉండే ఆహార పదార్థాలు:

రాత్రిపూట మసాలా, కారంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవద్దు దీనివలన నిద్ర సరిగ్గా పట్టకపోవడం, గుండెల్లో మంట కలగడం వంటివి జరుగుతూ ఉంటాయి.

ఎసిటిక్ ఫుడ్స్:

సిట్రస్ జ్యూస్, పచ్చి ఉల్లిపాయ, టమాట సాస్ వంటి వాటిని రాత్రి తీసుకుంటే హాట్ బర్న్ తో బాధపడాల్సి వస్తుంది కాబట్టి రాత్రిపూట అస్సలు వీటిని తీసుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news