‘శరణు కోరితే ప్రాణభిక్ష.. ఎదురిస్తే మరణం’.. ‘బింబిసార’ ట్రైలర్ అదిరిందిగా

-

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమా ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఆగస్టు 5న ఈ సినిమాను థియేటర్ లో ఎంజాయ్ చేయండి అని జూ.ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. జులై 4 విడుదలైన ఈ ట్రైలర్ ను యూట్యూబ్ లో 2.22 కోట్ల మంది వీక్షించారు.
కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ‘బింబిసార’. వశిష్ఠ.. దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, పాటలను పంచుకోగా ఇప్పుడు ‘రిలీజ్‌ ట్రైలర్‌’తో సినీ ప్రియులకు వినోదాన్ని అందించింది. ఈ ట్రైలర్‌ను కల్యాణ్‌ రామ్‌ సోదరుడు ఎన్టీఆర్‌ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.
త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడితో పాటు కల్యాణ్‌ రామ్‌ పోషించిన మరో పాత్రను ఇందులో చూడొచ్చు. యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్‌ సంభాషణలు, విజువల్స్‌తో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్‌ చిత్రంలో కేథరిన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. హైదరాబాద్‌లో ఈ నెల 29న నిర్వహించనున్న ‘బింబిసార’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news