సీఎం కేసీఆర్: UCC బిల్లును మేము వ్యతిరేకిస్తాం..

-

మరికొన్ని రోజులలోనే ఢిల్లీ పార్లమెంట్ లో వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలో ఎప్పటిలాగే ఎన్డీఏ కొన్ని బిల్లులను పాస్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అందులో ఈసారి ఎక్కువగా హైలైట్ అవుతున్న బిల్లులలో కామన్ సివిల్ కోడ్ ఒకటి. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రం తీసుకువస్తున్న ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం అని ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక దీని వలన నష్టం ఏమిటన్న విషయాన్నీ తెలియచేస్తూ… ఈ బిల్లు పాస్ అయ్యి అమలులోకి రావడం వలన ఈ దేశంలో ఉన్న అన్ని మతాల వారిలో అయోమయం కలుగుతుందని కేసీఆర్ వివరించారు. ఇక అధికార బీజేపీకి దేశ ప్రజల అభివృద్ధి కన్నా… వారిని విద్వేషపరచే రాజకీయం దిశగా అడుగులు వేస్తోంది.

 

BJP పాలనా కాలంలో ఉండగా ఎన్నో అంశాల విషయంలో దేశ ప్రజల మధ్యన చిచ్చు పెట్టింది. అందుకే ఇప్పుడు దేశ ప్రజల విభజనకు కారణం అవుతుంది అని భావిస్తున్న ఈ బిల్లును మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news