రేపే 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు

-

రేపటి నుంచి 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దాదాపు 10 లక్షల మందికి పైగా కొత్తగా పెన్షన్లు ఇస్తున్నామని ప్రకటన చేశారు.  అన్ని పండుగలు కలిసి ఒక రోజు వస్తే ఎలా ఉంటుందో వజ్రోత్సవ వేడుకలు అలా జరుగుతున్నాయని..స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అన్నామో రామచంద్ర అన్నట్టు దేశంలో పరిస్థితి ఉండేదని తెలిపారు. ఇప్పుడే ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయి కి ఎదిగింది…ఆహార ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానములో ఉందని వెల్లడించారు.

స్వంత ఆదాయ వృద్ధి రేటుతో దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది…ఇది మన trs పనితీరుకు నిదర్శనం అని పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకంటే విభిన్నంగా తెలంగాణ నిలిచిందన్నారు.మన రాష్ట్రా తలసరి ఆదాయం లక్ష 24 వేలు ఉంటే ఇప్పుడు 2 లక్షల 78 వెలతో అగ్రస్థానంలో ఉన్నామన్నారు.

తెలంగాన ఏర్పడినప్పుడు మన బడ్జెట్ 62 వేల కోట్లు..గతేడాది లక్ష 24 వేల కోట్లు అని…ఏడేళ్లలో మూడింతల వృద్ధి రేటు సాదించామన్నారు. సంగారెడ్డి జిల్లా గాంధీ గారు కలగన్న కళకు నిదర్శనం అన్నారు. కేంద్రం ఈ మధ్య అవార్డులు ప్రకటించింది…సాంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో దేశంలో ఉత్తమ గ్రామాలు 20 ఉంటే అందులో 19 మన తెలంగాణావే అని చెప్పారు.సంగారెడ్డి జిల్లాకు సీఎం కేసీఆర్ సంగమేశ్వర పథకంతో వరం ప్రకటించారన్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news