సిట్ వేసి ఏం పీకుతారు..? : నారా లోకేష్‌

-

గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వైసీపీ ప్రభుత్వం విచారణకు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ‘సిట్’కు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విచారణ వేగవంతం అవుతుందని, చంద్రబాబు, లోకేష్ అరెస్ట్ ఖాయమని అంటున్నారు వైసీపీ నేతలు. ఇన్నాళ్లూ స్టేలతో తప్పించుకు తిరిగారని, ఇక అది సాధ్యం కాదని ఎద్దేవా చేస్తున్నారు. ఈ కౌంటర్లపై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు.

AP govt gives permission to Nara Lokesh's Yuva Galam padayatra

వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా కొండను తవ్వి ఎలుకను కాదు కదా ఎలుక తోకను కూడా పట్టుకోలేనివాళ్లు ‘సిట్’వేసి ఏం పీకుతారని ప్రశ్నించారు నారా లోకేష్​. తాము జైలుకు వెళ్లే సంగతి పక్కన పెడితే… జగన్​ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు లోకేష్​. జే బ్రాండ్​ మద్యంతో ప్రాణాలు తీస్తున్న జగన్​ జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. “జే బ్రాండ్ మద్యంలో ఒక్క సీసా చాలు.. మీరు, మీ జే బ్రాండ్ గ్యాంగ్ అంతా జైలులో ఉండేందుకు రెడీగా ఉండండి..” అంటూ మద్యం తీసుకెళ్తున్న వాహనం వద్ద సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు లోకేష్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news