Ashwagandha : అశ్వగంధ తో 12 ఆరోగ్య ప్రయోజనాలు! సంతానోత్పత్తికి దివ్యౌషధం

-

ఆయుర్వేదంలో అశ్వగంధకు ఉన్న పేరు అంతా ఇంతా కాదు. దీన్ని ముఖ్యంగా సంతానోత్పత్తిని ప్రసాదిందే దివ్యౌషధంగా భావిస్తారు. ఈ అశ్వగంధ (Ashwagandha) కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అశ్వగంధ మన పూర్వీకుల కాలం నుంచి అందుబాటులో ఉన్న మూలిక. దీన్ని వాడటం వల్ల మనలో ఒత్తిడిని తరిమేస్తుంది. ఇది మెదడుకు కూడా మేలు చేస్తుంది.షుగర్‌ లెవెల్స్‌ తగ్గిస్తుంది. అంతేకాదు స్పెర్మ్‌ కౌంట్‌ పెంపునకు ఇది చాలా ఉపయోగపడుతుంది. దాదాపు మూడువేల ఏళ్లకు పైగా దీన్ని వాడుతున్నారు.

Health Benefits of Ashwagandha | అశ్వగంధ
Health Benefits of Ashwagandha | అశ్వగంధ
  • బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోతుంటే… అలాంటి వారు అశ్వగంధను వాడొచ్చు. ఇది ఇన్సులిన్‌ స్థాయిని పెంచుతుంది.
  • ఇందులో వితాఫెరిన్‌ అనే పదార్థం కేన్సర్‌ను అడ్డుకోగలదని పరిశోధనల్లో తేలింది.
  • ఒత్తిడిని పెంచే హార్మోనును ఎక్కువగా విడుదల అవ్వకుండా అశ్వగంధ చెయ్యగలదు.
  • మీకు టెన్షన్లు, ఒత్తిడి, కంగారు, ఆందోళన, హడావుడి, బిజీ లైఫ్‌ స్టైల్‌ ఉంటున్నట్లైతే… మీరు అశ్వగంధ వాడటం మేలు. ఎందుకంటే మీ బ్రెయిన్‌ని కాపాడుతుంది.
  • డిప్రెషన్‌కు గురై చావలనుకునే వారికి కూడా అశ్వగంధతో వారికి జీవితం మీద తిరిగి ఆశలు రేపుతుంది. నెగెటివ్‌ ఆలోచనల నుంచి పాజిటివ్‌ అయిపోతారు.
  • పిల్లలు పుట్టని మగవారికి సరైన మందు ఈ అశ్వగంధ. ఇది స్పెర్మ్‌ కౌంట్‌ను పెంచడానికి ఈ మూలికకు తిరుగులేదు.
  • కండరాల్లో బలం పెంచడంలో అశ్వగంధకు మంచి పేరుంది. మగవారు రోజుకు 750 మి.గ్రా చొప్పున నెలపాటు తీసుకుంటే కండరాలు ఉక్కులా తయారవుతాయి.
  • శరీర ఉష్ణోగ్రతను కూడా కంట్రోల్‌ చెయ్యడంలో అశ్వగంధ బాగా పనిచేస్తుంది. వేడిని తగ్గించుకోవడానికి ఇది ఓ దివ్యౌశధం.
  • చెడు కొలెస్ట్రాల్‌ను అశ్వగంధ తొలగిస్తుంది. తద్వారా గుండెకు మేలు చేస్తుంది.
  • మతిమరపు లక్షణాలు వారిలో కనిపించవు. ఏ కారణంగానైనా మెదడు దెబ్బతింటే… వారు అశ్వగంధ వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

అశ్వగంధ ఆన్‌ లైన్‌ ఈ–కామర్స్‌ సైట్లలో లభిస్తోంది. లేదంటే ఆయుర్వేద షాపుల్లో ఉంటుంది. అశ్వగంధ వల్ల పెద్దగా సైడ్‌ ఎఫెక్టులు ఏవీ లేవు. ఐతే… గర్భిణీలు, బాలింతలు మాత్రం దీన్ని తీసుకోకూడదు.

 

Read more RELATED
Recommended to you

Latest news