నేటి నుంచే కోటి దీపోత్సవం.. భక్తి టీవీలో లైవ్.. నేటి కార్యక్రమాలు ఇవే..

-

కార్తీక మాసం వచ్చిందంటే భక్తీ టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం ప్రత్యేకంగా నిలుస్తుంది. భక్తి భావనలు ప్రతీ ఇంటికి చేరేలా కార్యక్రమాలు ఉంటాయి. భక్తి టీవి నిర్వహించే కోటి దీపోత్సవం ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్ముతాయి. కోటికాంతులు భక్తుల మనసులను పులకింపజేస్తాయి. ఓంకారానికి తోడు శంఖారావాలు, ఢమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణాలు, జగద్గురువుల అనుగ్రహ భాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు దీపోత్సవానికి ఆధ్యాత్మిక శోభను సంతరించనున్నాయి.

ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవి కోటి దీపోత్సవం నిర్వహిస్తోంది. ఈరోజు నుంచి ఈనెల 22 వరకు కన్నుల పండగగా ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతీ రోజు 5.30 గంటలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు శ్రీ త్రిదండి రామానుజ స్వామీజీ, శ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి అనుగ్రహ భాషణం, బ్రహ్మ శ్రీ నోరి నారాయణ మూర్తి ప్రవచనాలు ఉంటాయి. ఇక వేదికపై కాశీ స్పటిక లింగానికి సహస్ర కలశాభిషేకం, కోటి మల్లెల అర్చణ నిర్వహిస్తారు. భక్తుల చేత శివలింగానికి కోటి మల్లెల అర్చన ఉంటుంది. తదుపరి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండగగా జరిపిస్తారు. ఆ తరువాత హంస వాహన సేవ నిర్వహిస్తారు.

కోటి దీపోత్సవాన్ని లైవ్ లో చూసేందుకు ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి

 

Read more RELATED
Recommended to you

Latest news