అమలాపురం అల్లర్ల కేసులో మరో 15 మంది అరెస్ట్

-

అమలాపురం అల్లర్ల కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో మరో 15 మందిని అరెస్టు చేశారు పోలీసులు. వీరితో కలిపి ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 235 కు చేరింది. ఈ అల్లర్లలో మొత్తం 258 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అల్లర్లలో ఎవరి ప్రమేయం ఉన్నా ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు పోలీసులు. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా మే 24న దాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో అల్లర్లు జరిగాయి.

ఈ అల్లర్లలో మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టారు. నిరసన కారులు మామూలుగా ధర్నా, రాస్తారోకోలు నిర్వహిస్తారని పోలీసులు భావించారు. కానీ ఉన్నట్టుండి ఆరోజు నిరసనకారులు రెచ్చిపోయి వాహనాలకు నిప్పు పెట్టారు. ఒకానొక దశలో పరిస్థితి చేయిదాటి పోవడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చేదరగోట్టారు. కాగా ఈ అల్లర్ల తర్వాత జిల్లాలో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు బెయిల్ పొందారు. కాగా పరారీలో ఉన్న మిగతా 21 మంది కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news