చాలా మంది భవిష్యత్తు లో ఏ ఇబ్బందులు రాకూడదని ముందు నుండి డబ్బులని ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. ఉద్యోగం చేస్తున్నప్పుడే రిటైర్మెంట్ ప్లాన్స్‌ను సరిగ్గా ఎంపిక చేసుకుంటే
వృద్దాప్యం లో ఎలాంటి సమస్యలు రావు. జీవితం అంతా కూడా బాగుంటుంది. ఆనందంగా ఉండచ్చు. రిస్క్ లేకుండా ఎందులో అయినా మీరు డబ్బులు పెట్టాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ బెస్ట్.
పోస్టాఫీస్ కొన్ని పధకాలు ని తీసుకు వచ్చింది. అందులో రికరింగ్ డిపాజిట్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో మీరు డబ్బులు పెడితే ప్రతీ నెలా రూ.10 వేలు డిపాజిట్ చెయ్యాల్సి వుంది. మీరు కనుక ఇలా ఇన్వెస్ట్ చేస్తూ వెళితే మెచ్యూరిటీ సమయానికి రూ. 16 లక్షల వరకు పొందొచ్చు.
రికరింగ్ డిపాజిట్ కి 5.8% వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ ప్రతి మూడో నెలలకి కాంపౌండింగ్ మొత్తం తో యాడ్ అవుతుంది. దీనిపై వచ్చే రిటర్న్స్ మీదకు మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. 100తో ఈ ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో మీరు ఎంతైనా సరే పెట్టచ్చు. ఈ పథకం లో మీరు 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి.
ప్రతీ నెలా రూ. 10 వేలు పెట్టుబడి పెడితే 10 సంవత్సరాలను ఇలా కొనసాగిస్తే ఏడాదికి లక్షా 20 వేల చొప్పున 10 ఏళ్లకు రూ. 12 లక్షలు వస్తాయి. ఈ మొత్తానికి 5.8 శాతం వడ్డీ రేటు తో మీరు రూ.16,15,721 పొందొచ్చు. అదే మీరు రూ. 10 వేలు డిపాజిట్ చెయ్యలేకపోతే నెలకు రూ. 3 వేలు పెట్టుబడి పెట్టి 10 సంవత్సరాలలో 5 లక్షలకు వరకు పొందొచ్చు.