బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు కావడం వల్లనే 2 సీట్లు లాస్ : మంత్రి కొండా సురేఖ

-

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. శుక్రవారం హన్మకొండలోని కాంగ్రెస్ కార్యాలయంలో కడియం శ్రీహరి, కడియం కావ్యలతో కలిసి ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారని ఆరోపించారు. అందుకే తెలంగాణలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అవ్వడం వల్లే కాంగ్రెస్ పార్టీ రెండు ఎంపీలు సీట్లు కోల్పోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఇటీవల వరంగల్ ఎంపీగా గెలిచిన కడియం కావ్య మాట్లాడుతూ.. ఎంపీగా తన గెలుపునకు కృషి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

తన తండ్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేరుకు మచ్చ రాకుండా ముందుకు సాగుతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ 8, బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుచుకోగా.. ఎంఐంఎం తమ సిట్టింగ్ స్థానమైనా హైదరాబాదున్ను మరోసారి నెలబెట్టుకుంది. పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కచోట కూడా విజయం సాధించకుండా ఘోర ఓటమి చవిచూసింది. కేసీఆర్, హరీష్ రావు సొంత జిల్లా అయిన మెదక్ పార్లమెంట్ సీటులోనూ బీఆర్ఎస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news