ముగ్గురూ ముగ్గురే..జనబలం ఎవరిది?

-

ఏపీ రాజకీయాల్లో ప్రధాన పార్టీలు బల నిరూపణలో గట్టిగా పోటీ పడుతున్నాయి. భారీ సభల ద్వారా తమ సత్తా ఏంటో చూపిస్తున్నాయి. వైసీపీ-టీడీపీ-జనసేనలు భారీ సభలతో తమ సత్తా ఏంటో చూపించాయి. విచిత్రం ఏంటో…ఈ ఏడాది మూడు పార్టీల సభలు జరగగా, మూడు సూపర్ సక్సెస్ అయ్యాయి. దీని బట్టి చూస్తే ఎవరికి జనబలం ఎక్కువ ఉందో క్లారిటీ రావడం లేదు.

రాజకీయంగా చంద్రబాబు, జగన్, పవన్ లకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది..అలాగే మూడు పార్టీలకు భారీగానే కార్యకర్తలు ఉన్నారు. అందువల్లే మూడు సభలు సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు. మార్చిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ భారీ స్థాయిలో జరిగింది..జనసేన సభకు ప్రజల నుంచి స్పందన కూడా ఎక్కువగానే వచ్చింది. ఆ సభ తర్వాత పవన్ మరింత దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు.

ఇక మే లో జరిగిన మహానాడు కార్యక్రమం ఓ రేంజ్ లో జరిగింది..ఇప్పటికే అధికారానికి దూరమై..వైసీపీ చేతుల్లో చుక్కలు చూస్తున్న టీడీపీ కేడర్ భారీ స్థాయిలో మహానాడుకు హాజరయ్యి…తమ సత్తా ఏంటో చూపించారు. అధికార వైసీపీ రాజకీయంగా మహానాడుకు బస్సులు, ట్రావెల్స్ వెళ్లకుండా అడ్డుకున్నా సరే…టీడీపీ కేడర్ ఎక్కడా తగ్గకుండా ట్రాక్టర్లు, లారీలు వేసుకుని వెళ్ళిపోయారు. మహానాడుకు భారీ స్థాయిలో కార్యకర్తలు, టీడీపీ అభిమానులు వస్తారని, టీడీపీ అధిష్టానమే ఊహించలేదు. ఈ మహానాడు తర్వాతే టీడీపీ నేతలు, చంద్రబాబు ఇంకా దూకుడుగా ముందుకెళుతున్నారు.

ఇక ప్రతిపక్షాల సభలే అలా జరిగితే..అధికార వైసీపీ సభ ఇంకా ఏ స్థాయిలో జరగాలి…అందుకే తాజాగా జరిగిన వైసీపీ ప్లీనరీ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు వచ్చారు. పైగా బస్సులు, ట్రావెల్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్లీనరీకి జనం వచ్చారు. ప్లీనరీలోనే సునామీ సృష్టించారు. అక్కడ నుంచి ఎన్నికల్లో మళ్ళీ గెలవడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి.

మొత్తానికైతే జగన్-బాబు-పవన్ లు…తమ సత్తా ఏంటో చూపించారు…మూడు సభల్లో జనబలం కనిపించింది. అయితే పూర్తిగా జనబలం ఎవరికి ఎక్కువ ఉందనే విషయం తెలియాలంటే..ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news