ఎస్ఈసీ షాక్.. డబ్బు పంపిణీ చేస్తున్న వారి వివరాలు ఐటీకి !

మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు పంపిణీ పై ఎస్ఈసీ సీరియస్ అయింది. ఎన్నికల్లో డబ్బు విపరీతంగా పంపిణీ చేస్తున్న వారి వివరాలను ఐటీకి అందిస్తున్నట్టు వెల్లడించింది. ఈ డబ్బు పంపిణీ.. ఎన్నికల ఖర్చు పై ప్రత్యేక నిఘా పెట్టినట్టు కూడా ఎస్ ఈసీ స్పష్టం చేసింది. విజయవాడ, గుంటూరు విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో డబ్బు పంపిణీ విపరీతంగా జరుగుతున్నట్టు తమకు ఫిర్యాదులు అందాయి అని ఎస్ఈసీ పేర్కొంది.

ఎన్నికల నిఘా బృందాలు డబ్బు, మద్యం పంపిణీ పై ఎస్ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు పేర్కొంది. ఇక మొదటి నుండి ఉన్నంత గ్యాప్ ఎన్నికల సంఘం అలాగే ప్రభుత్వం మధ్య తగ్గిపోతూ వస్తుంది. అందుకే ఇప్పుడు నిమ్మగడ్డను ఏపీ ప్రతిపక్షాలు, విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. మరి ఎన్నికల సంఘం డబ్బుకు సంబంధించిన కీలక ప్రకటన చేయడంతో అభ్యర్థులు టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.