బాలీవుడ్ స్టార్ సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి సమయంలో… చాలా మంది పేద ప్రజలకు అండగా నిలిచాడు. లాక్ డౌన్ తో ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న పేద ప్రజలను కూడా తమ తమ.. సొంతూళ్లకు స్పెషల్ బస్సులు వేసి… చేర్చారు. అలాగే… ఉపాధి కోల్పోయిన వారికి కూడా తన వంతు సహాయం చేసుకుంటూ వచ్చారు సోనూ సూద్.
ఈ నేపథ్యంలోనే.. సోనూసూద్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. దానిని గతంలోనే కొట్టిపారేశారు సోనూసూద్. అయితే.. తాజాగా మరోసారి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన సోదరి మాళివిక సోనూసూద్ వచ్చే ఏడాది పంజాబ్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆమే ఏ పార్టీ నుంచి బరిలోకి… దిగుతారనే.. విషయాన్ని చెప్పలేదు. త్వరలో… పార్టీ పేరు ప్రకటిస్తామని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆమె నిబద్ధత సాటిలేనిదని సోనూ పేర్కొన్నారు. మాళవిక మోగా నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబడే అవకాశాలున్నాయని సోనూసూద్ చెప్పారు.