ఒక్క రోజులోనే 43 ల‌క్షల‌కుపైగా ఐటీఆర్‌లు..

-

ఆర్థిక పన్నులు చెల్లించడానికి ఇంకా ఒకరోజు మాత్రమే గడువు ఉంది. అయితే.. శుక్ర‌వారం వ‌ర‌కు 4.52 కోట్ల మందికి పైగా ఐటీఆర్‌లు దాఖ‌లు చేశార‌ని శ‌నివారం తెలిపింది ఆదాయం ప‌న్ను విభాగం. శుక్ర‌వారం ఒక్క‌రోజే 43 ల‌క్ష‌ల‌కు పైగా ఐటీఆర్‌లు దాఖ‌ల‌య్యాయ‌ని వెల్ల‌డించింది ఆదాయం ప‌న్ను విభాగం. ఇప్ప‌టికైతే ఐటీఆర్‌లు దాఖ‌లు చేయ‌డానికి గ‌డువు పొడిగించే యోచ‌నేమీ లేద‌ని తేల్చి చెప్పింది ఆదాయం ప‌న్ను విభాగం. గ‌డువులోపు ఐటీ రిట‌ర్న్స్ స‌బ్మిట్ చేయాల‌ని ప‌న్ను చెల్లింపుదారుల‌ను కోరుతూ ఆదాయం ప‌న్ను విభాగం ట్విట్ట‌ర్ వేదిక‌గా అప్పీల్ చేసింది. `మీరు కూడా ఐటీఆర్ దాఖ‌లు చేశార‌నే భావిస్తున్నాం. ఒక‌వేళ ఐటీఆర్‌లు స‌బ్మిట్ చేయ‌కుంటే ద‌య‌చేసి ఇప్పుడైనా దాఖ‌లు చేయండి. 2022-23 అంచ‌నా సంవ‌త్స‌రం (2021-22) ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డానికి తుది గ‌డువు 2022 జూలై 31` అని ట్వీట్ చేసింది. ఐటీఆర్‌ల దాఖ‌లు ప్ర‌క్రియ‌ను కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు (సీబీడీటీ), కేంద్ర ఆర్థిక‌శాఖ ప‌ర్య‌వేక్షిస్తున్నాయ‌ని ఐటీ అధికారులు తెలిపారు.

How to file Income Tax Return online: Here are step-by-step guidelines -  Information News

ఎప్ప‌టిక‌ప్పుడు ఐటీఆర్‌ల దాఖ‌లు ప్ర‌క్రియ‌లో సాంకేతిక లోపాల‌ను ప‌రిష్క‌రించ‌డానికి సాంకేతిక నిపుణుల‌తో `వార్ రూమ్ ( war room )`.. 24 గంట‌ల పాటు అందుబాటులో ఉంద‌ని ఐటీ అధికారి పీటీఐకి చెప్పారు. వార్ రూమ్‌తోపాటు సీబీడీటీ సోష‌ల్ మీడియా టీం ఎప్ప‌టిక‌ప్పుడు ఐటీఆర్‌లు దాఖ‌లు చేసే వ్య‌క్తులు, ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే స‌మాచారాన్ని, ప్ర‌తిస్పంద‌న‌ల‌ను సేక‌రిస్తుంద‌న్నారు. ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్‌లో ప‌న్ను చెల్లింపుదారులకు వ‌చ్చే ప్ర‌తి స‌మ‌స్య‌పైనా ప్ర‌తిస్పందిస్తూ వాటిని ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్‌లో ఐటీఆర్ దాఖ‌లు స‌మ‌యంలో వ‌చ్చే సాంకేతిక స‌మ‌స్య‌ల‌పై `మా టీమ్‌కు స‌మాచారం ఇవ్వండి. ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్ బేష్షుగ్గా ప‌ని చేస్తున్న‌ది. బ్రౌజ‌ర్ క్యాచీ క్లియ‌ర్ అయిన త‌ర్వాత తిరిగి ప్ర‌య‌తించండ‌ని మేం కోరుతున్నాం. అయినా మీరు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌ట్ల‌యితే ద‌య‌చేసి మీ వివ‌రాలు (పాన్‌, మొబైల్ నంబ‌ర్‌) ల‌ను ‘[email protected]’ అనే ఈ-మెయిల్‌కు పంపండి. మీతో మా టీం క‌నెక్ట్ అవుతుంది` అని పేర్కొంది ఐటీ విభాగం.

 

Read more RELATED
Recommended to you

Latest news