బల్గేరియాలో ఘోర ప్రమాదం జరిగింది. బల్గేరియా రాజధాని సోఫియా నుంచి 52 మంది పర్యాటకులతో బయలు దేరిన బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో ప్రయాణం చేస్తున్న మందిలో ఏకంగా 45 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘోర ప్రమాదం అర్థ రాత్రి సమయంలో చోటు చేసు కోవడంతో… ప్రాణ నష్టం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అయితే… అదృష్ట వశ్యాత్తు… కేవలం ఏడుగురు ప్రయాణి కులు మాత్రం కొన్ని గాయాలతో బయటపడ్డారు. ఇలాంటి ప్రమాదం బల్గేరియా చరిత్ర లోనే ఇప్పటి వరకు చోటు చేసుకోలేదని.. ఆ అక్కడి మంత్రి చెబుతున్నారు. ఇక ఈ ప్రమాదం చోటు చేసుకున్న వార్త.. సమా చారం అందుకున్న వెంటనే… ఘటన స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. అ యితే… అప్పటికే 45 మంది సజీవ దహనం అయ్యారు. మిగతా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘ టన వివరాలు తెలియాల్సి ఉంది.