రక్షణ రంగంలో కీలక ముందడుగు.. ఆ విమానాలకి ఆర్డర్ ఇచ్చిన ఇండియా !

-

రక్షణ రంగంలో భారత్ కీలక ముందడుగు వేసింది. లాక్ హీడ్ మార్టిన్ కంపెనీకి మరో 6 సి-130 జె. సూపర్ హెర్క్యలస్ విమానాలు ఆర్డర్ ఇచ్చింది భారత దేశం. రక్షణ దళాలకు రక్షణ పరికరాల రవాణాలో ఈ సి-130 జె. సూపర్ హెర్క్యలస్ విమానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సముద్రమట్టానికి 16,614 అడుగుల ఎత్తులో చైనా సరిహద్దు ప్రాంతాలలో భారత రక్షణ బలగాలకు ముఖ్యమైన ఆయుధాల తరలింపులో సి-130 జె. సూపర్ హెర్క్యలస్ విమానాలు కొన్ని ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలో రక్షణ దళాల సామాగ్రి తరలింపులో ఈ సి-130 జె. సూపర్ హెర్క్యలస్ విమానాలు అత్యంత విజయవంతం అయ్యాయి.

అఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాలలో సి-130 జె. సూపర్ హెర్క్యలస్ విమానాలను అత్యంత విజయవంతంగా అమెరికా ఉపయోగించింది. సీ-130జే సూపర్ హెర్క్యూలస్ కార్గో యుద్ధ విమానాల అదనపు పరికరాలు, విడి భాగాలను భారత్ కు అమ్మడానికి అమెరికా సమ్మతించింది. మొత్తం 90 మిలియన్ డాలర్ల విలువైన కొనుగోలు ఒప్పందానికి అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ నిన్న అమోద ముద్ర వేసింది. సీ -130 జే సూపర్ హెర్క్యులస్ విమానాలను ఇప్పటిదాకా అమెరికా 17 దేశాలకు విక్రయించగా అందులో భారత్ ఒకటి. భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం ఐదు విమానాలు ఉన్నాయి. మరో ఆరు సూపర్ హెర్క్యులస్ విమానాల కోసం అమెరికా ఆర్డర్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news