BREAKING : ఏపీలో ఆరు కొత్త మండలాలు

-

ఏపీలో కొత్తగా 6 మండలాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదీస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలును అర్బన్‌, రూరల్‌ మండలాలుగా, మచిలీపట్నాన్ని సౌత్‌, నార్త్‌ మండలాలుగా విభజించనున్నట్లు పేర్కొంది. మచిలీపట్నంలోని 1-90, 40 వార్డులు, 18 గ్రామాలను మచిలీపట్నం నార్త్‌గా.. మచిలీపట్నం పరిధి 20-39 వార్డులు, బందరు రూరల్‌ సహా 12 గ్రామాలను సౌత్‌ మండలంగా విభజించింది.

Andhra News: ఏపీలో కొత్తగా మరో 6 మండలాలు.. ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ

మండలాల విభజనపై అభ్యంతరాలుంటే చెప్పాలని కోరింది. నెలలోగా అభ్యంతరాలను కలెక్టర్‌కు తెలపాలని పేర్కొంది. మండలాల విభజనకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. నోటిఫికేషన్లోని అభ్యంతరాలను, సలహాలు, సూచనల్ని 30 రోజుల్లోగా స్థానిక జిల్లా కలెక్టర్ కు తెలియ చేయాల్సిందిగా కోరింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news