బ్రేకింగ్ : ఒక్కరోజులో 67 మంది పోలీసులకు కరోనా.!

భారత్‌ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలోని అన్నీ రాష్ట్రాలతో పోల్చుకుంటే దీని ప్రభావం మహారాష్ట్రపై అధికంగా ఉంది. దీంతో కరోనాపై పోరాటంలో ముందున్న పోలీసులు కూడా వైరస్‌ మహమ్మారి బారినపడుతున్నారు.తాజాగా.. మరో 67 మంది పోలీసులకు కరోనా సోకింది. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా ఈ మేరకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో వైరస్‌ బారినపడిన మొత్తం పోలీసుల సంఖ్య 4810కి చేరింది.

కాగా కరోనా వల్ల ఇప్పటి వరకు 59 మంది పోలీసులు మరణించారు. కాగా, ఇప్పటికే కరోనా లక్షణాలున్న పోలీసులకు వైద్యసేవల కోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రత్యేక ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అలాగే కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ.. లాక్‌ డౌన్‌ ను జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.