ప్రియుడి తో కలిసి కోడలును హత్య చేసిన అత్త !

వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో కలతలు రేపుతున్నాయి. అంతేకాదు మానవ సంబంధాలను కూడా మంటగలుస్తున్నాయి. ఒక్కసారి ఆ అక్రమ సంబంధాలకు అలవాటు పడితే దాని నుంచి బయటపడటం చాలా కష్టం. అక్రమ సంబంధాల కారణంగా హత్యలకు కూడా పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. సరిగ్గా ఇలాంటి ఘటనే.. మరోటి చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని.. ఏకంగా కోడలినే హత్య చేసింది ఓ అత్త.

crime

ఈ దారుణ సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాడని ప్రియుడు నఫీస్ తో కలసి అర్దరాత్రి గొంతు నులిమి కోడలు ను హత్య చేసింది అత్త మంగమ్మ. మూడు సంవత్సరాల క్రితం మంగమ్మ భర్త నర్సింహులు అనారోగ్యంతో మృతి చెందాడు. ఇక ఈ భర్త లేక పోవడం తో నఫీస్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది అత్త మంగమ్మ.

అయితే ఈ అక్రమ సంబంధంపై అత్తను కోడలు ప్రశ్నించింది. దీంతో ఆగ్రహానికి గురైన అత్త మంగమ్మ.. ప్రియుడు నఫీస్ తో కలసి నిన్న అర్దరాత్రి గొంతు నులిమి కోడలు ను హత్య చేసింది. దీంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలిసులు నిందితురాలు ముగంమ్మ ను అదుపులో తీసుకోగా ప్రియుడు నఫీస్ కోసం గాలిస్తున్నారు.