హైదరాబాద్ మందు బాబులకు శుభవార్త. ఆ టైమింగ్స్ పెంచుతూ సర్కారు ఉత్తర్వులు..

-

తెలంగాణలో ప్రభుత్వ ఖజానాకు మద్యం ద్వారా భారీ ఆదాయం సమకూరుతున్న సంగతి తెలిసిందే. ప్రతినెల రాష్ట్రంలో రూ. 2,500 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.గత మార్చి నెలలో రూ. 2814 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా, ఇందులో నెల ఆఖరి రోజున రూ.307 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.గత ఏడాది డిసెంబర్ తర్వాత మార్చి నెలలోనే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.అయితే తాజాగా హైదరాబాద్ లోని బార్ షాప్ లో పని వేళలు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ ఖజానాకు మద్యం ద్వారా ఆదాయం మరింత పెరుగుతుందని చెప్పాలి.

 

 

ఈ నిర్ణయాన్ని హైదరాబాద్ కే పరిమితం చేస్తారా లేక ముందు ముందు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.అర్ధరాత్రి 12 గంటల వరకు బార్స్ నిర్వహించుకునేందుకు అనుమతి ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.అంతే కాదు వీకెండ్స్ లో ఏకంగా ఒంటిగంట వరకు బార్ లు తెరుచుకునెందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కార్.ఇక స్టార్ హోటల్లు, ఎయిర్ పోర్ట్ హోటల్లు లైసెన్స్ ఫీజు పై 25% అదనపు రుసుం చెల్లించి 24 గంటల పాటు మద్యం అమ్మకాలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news