సినీ నటి శ్రీ రెడ్డికి మరో షాక్ తగిలింది. సినీ నటి శ్రీ రెడ్డిపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత పై సామాజిక మాధ్యమాల్లో జుప్సాకరంగా మెసేజ్లు పెడుతుందంటూ..సినీ నటి శ్రీ రెడ్డిపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు మచిలీపట్నం టిడిపి సోషల్ మీడియా కన్వీనర్ అసిలేటి నిర్మల.
దళిత మహిళ అయిన మంత్రి అనిత పై అసభ్యకరంగ మాట్లాడినందుకు.. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని గుడివాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో… సినీ నటి శ్రీ రెడ్డిపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. నిర్మల ఫిర్యాదు మేరకు శ్రీ రెడ్డి పై U/s 192, 196, 353 (1) (b), 353 (2), 75 (1) (IV), 79 BNS and Sec 67, 67(A) of IT Act and Sec 3(1)(w)(ii) of SC/ST POA act 1989 కింద కేసులు నమోదు అయ్యాయి.