నిజామాబాద్‌లో లారీని ఢీకొట్టిన కంటైనర్.. ఇద్దరు మృతి

-

నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిసాన్ సాగర్ జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ కంటైనర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు స్పాట్‌డెడ్ అయ్యారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

లారీ-కంటైనర్ ఢీ
లారీ-కంటైనర్ ఢీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు హర్యానాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లీంచారు. ఈ మేరకు యాక్సిడెంట్‌కు గురైన లారీలను క్రేన్ సాయంతో తొలగించారు. అయితే ఆగిఉన్న లారీని కంటైనర్‌ను ఎలా ఢీకొట్టిందనే కోణంపై పోలీసులు విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news