90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం… లిఫ్ట్ ఇచ్చి మరీ !

-

దేశంలో లైంగిక దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. వాయి, వరుస లేకుండా మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు కొందరు మానవ మృగాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ లైంగిక దాడుల కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాడోల్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన చోటు చేసుకుంది. 90 ఏళ్ల వృద్ధిరాలు పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తన బంధువుల ఇంటికి వెళుతున్న వృద్ధురాలికి బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తి లిఫ్టు ఇస్తానని ఎక్కించుకున్నాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. వృద్ధురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news