BREAKING : కుక్క దాడి నుంచి తప్పించుకునేందుకు యత్నించిన స్విగ్గీ బాయ్ మృతి

-

కుక్క దాడి నుంచి తప్పించుకునేందుకు యత్నించిన స్విగ్గీ బాయ్ మృతి చెందాడు. పెంపుడు కుక్క దాడి నుంచి తప్పించుకునేందుకు మూడంతస్తుల భవనం పై నుంచి దూకిన స్విగ్గి డెలివరీ బాయ్ రిజ్వాన్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే ప్రాణాలు వదిలాడు.

ఈ నెల 9వ తేదీన రిజ్వాన్ బంజారాహిల్స్ లుంబిని రాక్ కాజిల్ అపార్ట్మెంట్స్ లో ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. డోర్ కొట్టగానే జర్మన్ షెపర్డ్ కుక్క… అతని పైకి వచ్చింది. దీంతో భయపడ్డ ఆ వ్యక్తి.. కింద పడిపోయాడు. అయితే ఇవాళ ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆ కుక్క యజమానిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news