డార్లింగ్ అంటే పిచ్చితో లేడీ ఫ్యాన్ ఏం చేసిందంటే..

-

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అంటే ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే..ఒక్క సినిమా అతని క్రేజ్ ను పూర్తిగా మార్చి వేసింది.అదే దర్షక ధీరుడు రాజమౌలి తెరకెక్కించిన బాహుబలి..బాహుబలి సిరీస్‌ లతో విదేశాల్లోనూ ఆయన పాపులారిటీ పెరిగిపోయింది. అందుకే ఆయన చేసే సినిమాలన్నీ విదేశాల్లో కూడా విడుదలవుతున్నాయి. డైరెక్టర్లు కూడా పాన్‌ వరల్డ్‌ను దృష్టిలో ఉంచుకునే కథలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభాస్‌ నటిస్తోన్న ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్‌-కే, స్పిరిట్‌ కథలన్నీ పాన్‌ ఇండియా సినిమాలే. ఈ లు ఎప్పుడెప్పుడూ థియేటర్లలోకి వస్తాయా..డార్లింగ్‌ను ఎప్పుడు చూద్దామా.. అని అందరూ ఎదురుచూస్తున్నారు.

కాగా వరల్డ్‌ వైడ్ ఫ్యాన్‌ బేస్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్‌ పుట్టినరోజు నేడు (అక్టోబర్‌22). అభిమానులు ముద్దుగా డార్లింగ్‌ అని పిలుచుకునే ఈ హీరోకు ఎంత క్రేజ్‌ ఉందో ఒకసారి తెలుసుకుందాం రండి. బాహుబలి తోనే పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్‌. ఈచిత్రంతోనే అతని క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఇప్పటికీ కొన్ని హోటల్స్‌ తమ ప్రమోషన్స్‌కి బాహుబలి పేరునే వాడుకుంటున్నాయి. బాహుబలి థాలీ, పరాఠా, కట్టప్ప బిర్యానీ, భల్లాలదేవ పాటియాలా లస్సీ, శివగామి షాహి పక్వాన్ వంటి స్పెషల్‌ వంటకాలను మెనూలో చేర్చుతూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికీ బాహుబలి థాలీకి ఎంతో డిమాండ్‌ ఉంది..

ఇప్పటికే కొన్ని టాయ్స్‌ కంపెనీలు బాహుబలి బొమ్మలను తయారుచేసి తమ వ్యాపారాన్ని మూడుపువ్వులు ఆరు కాయలుగా మల్చుకున్నాయి. ఇక జపాన్‌లో యంగ్ రెబల్‌ స్టార్‌కు బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీరిని ఆకట్టుకునేందుకు అక్కడ ఉండే ఓ హోటల్‌ ఓ స్పైసీ డిష్‌ ప్యాకేజింగ్‌కు ప్రభాస్‌ ఫోటోను అతికించి తమ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్‌ చేసుకుంటోంది. ఓసారి జపాన్‌ లేడీ ఫ్యాన్స్‌ అంతా కేవలం ప్రభాస్‌ను కలవడానికే మనదేశం వచ్చారు. అతని ఇంటి ముందు కూడా కొన్ని ఫొటోలను దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇక ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఓ ఫ్యాన్‌ ఏకంగా తన వీపుపై బాహుబలి ట్యాటూను వేయించుకున్నాడు..ఇప్పుడు రష్యన్‌కు చెందిన ఓ లేడీ ఫ్యాన్‌ ‘లవ్‌ ప్రభాస్‌’ అంటూ తన వీపుపై పచ్చబొట్టు వేయించుకోని తన ప్రేమను ఛాటుకుంది..ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news