ఏపీలో రాజధాని రోడ్డును తవ్వేసిన రైతు

-

ఏపీలో ఓ రైతు ఏకంగా రాజధాని రోడ్డునే తవ్వేశాడు. పొలం చదును చేసేందుకే తాను రోడ్డును తవ్వానని రైతు చెప్పాడు. తవ్విన కంకర్‌చిప్స్‌ను గ్రామంలో ప్రజావసరాలకు వినియోగించినట్లు తెలిపారు.

గుంటూరు జిల్లా  తాడేపల్లి మండలం పెనుమాక పరిధిలో ఓ రైతు రాజధాని శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన రహదారిని తవ్వేసిన ఘటనపై రెవెన్యూ అధికారులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశానికి కంకర చిప్స్‌తో మార్గాన్ని ఏర్పాటు చేసింది. గత నెల 31న పెనుమాక గ్రామానికి చెందిన గోవిందరెడ్డి అనే రైతు ఆ మార్గాన్ని తవ్వుకుని ట్రాక్టర్ల ద్వారా తరలించినట్లు వచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు గురువారం విచారణ జరిపారు. రెవెన్యూ ఆర్‌ఐ ప్రశాంతి తమ సిబ్బందితో కలిసి రహదారి తవ్విన ప్రదేశాన్ని పరిశీలించారు.

అనంతరం జరిగిన ఘటనపై రైతు నుంచి వివరణ తీసుకుని ఓ నివేదికను తహసీల్దార్‌ శ్రీనివాసులురెడ్డికి అందజేశారు. ఆర్‌ఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా తహసీల్దార్‌ సదరు రైతుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే తాను ఆ పొలం కొనుగోలు చేసినట్లు గోవిందరెడ్డి తెలిపారు. పొలం చదును చేసేందుకు తాను తవ్వటం జరిగిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news