చిరంజీవి సినిమా సెట్ లో భారీ అగ్నిప్రమాదం

-

చిరంజీవి సినిమా సెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఏడాది కిందట ఆచార్య సినిమాను చిరంజీవి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా కోసం కోకపేట లేక్‌ సమీపంలో ఏర్పాటు చేసిన సెట్‌ అలాగే ఉంచారు. అయితే, తాజాగా కొకపేట లేక్ సమీపంలో ఉన్న ఆచార్య సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మంటలను గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చింది సెక్యూరిటీ. ఈ తరుణంలోనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది..మంటలను పూర్తిగా అదుపు చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో.. సెట్ లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సిగరెట్ తాగి పడేయడంతోనే ప్రమాదం జరిగినట్టు సెట్ సిబ్బంది చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news