ఆచార్య ధర్మస్థలి సెట్ కు మంటలు.. రూ.23 కోట్ల నష్టం..!

-

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా గత ఏడాది ఏప్రిల్ నెలలో విడుదలై భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ డిజాస్టర్ ను చవి చూడడంతో మెగా అభిమానులు ఒక్కసారిగా నిరాశ వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమా మొత్తం ధర్మస్థలి టెంపుల్ నేపథ్యంలో ఉంటుంది. ఇందుకోసం ఆచార్య టీం షూటింగ్ టైంలో భారీ టెంపుల్ నిర్మించారు. హైదరాబాదులోని రంగారెడ్డి జిల్లా కోకాపేట సమీపంలో ఉన్న 20 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 23 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి ఈ ధర్మస్థలి టెంపుల్ సెట్ వేయడం జరిగింది.

విజువల్ వండర్ను తలపిస్తున్న ఈ సెట్ జనాలను బాగా ఆకర్షిస్తుండడంతో సినిమా పూర్తయిన తర్వాత కూడా సెట్ ను తీసివేయలేదు.. అయితే ప్రస్తుతం ఆ టెంపుల్ సెట్ కు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెట్ మొత్తం మంటల్లో కాలిపోతున్నట్లుగా చూపుతున్న వీడియో ఒకటి నెట్టింట చాలా వైరల్ గా మారుతోంది. ఈ ఫైర్ ఇన్సిడెంట్ ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది బాగా వైరల్ గా మారుతుంది.. మెయిన్ ఎంట్రెన్స్ వద్ద కూర్చుని ఎవరో సిగరెట్ తాగి ముక్క పడేసారని.. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే సెట్ లో మంటలు చెలరేగాయని దీని రికార్డు చేసిన వ్యక్తులు మాట్లాడుతున్నారు.

మొత్తానికి మంటలు భారీగా చెలరేగి సెట్ మొత్తం కాలిపోతున్నట్లు.. వీడియో ద్వారా మనం చూడవచ్చు. ఇకపోతే దగ్గర్లో నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో మంటలు పూర్తిగా వ్యాపించక ముందే ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయడంతో హుటా హుటిన ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేసే ప్రయత్నం చేశారు. ఇకపోతే సురేష్ సెల్వరాజన్ నిర్మించిన ఈ సెట్ కి రూ. 23 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా కొందరు చేసిన తప్పిదం వల్ల రూ.23 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news