వేసవిలో కరెంట్ కోతలు అస్సలు ఉండవని తెలిపారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. నల్లగొండ జిల్లా అనుముల (మం) వ్యవసాయ మార్కెట్ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారంకు మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్, ఎంపి బడుగుల లింగయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం, అన్ని శాఖలకు మంత్రిగా పనిచేస్తానని చెప్పుకున్న జానారెడ్డి రాజవరం మేయర్ కి నీటిని ఎందుకు ఇవ్వలేక పోయారు… పక్క రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో 6, 7 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారు…తెలంగాణాలో కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి మీ రాష్ట్రాలలో చేసుకోండని కోరారు. కేంద్రమంత్రులు తెలంగాణలోకి వొచ్చి మీటింగ్లు పెడితే వాళ్ళ దగ్గర అభివృద్ధి జరిగిందో లేదో అడిగి నిలదీయండని… తెలంగాణ రాష్ట్రంలో ఆకలి కేకలు లేవని పేర్కొన్నారు.
తెలంగాణ తప్ప దేశవ్యాప్తంగా 35 శాతం ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని… పేద ప్రజల జేబులు మోదీ కొడితే పేద ప్రజల కడుపు కేసీఆర్ నింపుతుండన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు పెంచింది మోదీ కదా… కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ నీ కతం చేసింది మోదీ కాదా అని ఆగ్రహించారు. 3 సంవత్సరాల కాలంలో అద్భుతమైన యాదగిరిగుట్టనీ నిర్మించిన కేసీఆరేనని కొనియాడారు.