భార్యను చంపి.. పెద్ద పాత్రలో శవాన్ని ఉడికించిన భర్త

-

పాకిస్తాన్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య గొంతు కోసి.. పెద్ద పాత్రలో శవాన్ని ఉడికించాడో భర్త. సింధ్ ప్రావిన్స్‌ కి చెందిన ఆషిక్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్‌ పాఠశాలలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య నర్గీస్‌తోపాటు ఆరుగురు పిల్లలు. అయితే ఆషిక్‌కు భార్గ నర్గీస్‌తో తరచూ గొడవలు జరిగేవి. తన భార్యను వేరే వ్యక్తితో అక్రమంగా సంబంధాలు పెట్టుకోవాలని తరచూ బలవంతం చేసేవాడు. దీన్ని నర్గీస్ ఆ విషయానికి ఒప్పుకునేది కాదు. ఈ క్రమంలో గురువారం వీరిద్దరి మధ్య మరోసారి గొడవ తలెత్తింది.

murder

దీంతో కోపోధ్రిక్తుడైన ఆషిక్ తన ఆరుగురు పిల్లల కంటి ముందే భార్య గొంతు కోసి చంపాడు. అనంతరం స్కూల్‌లోని వంట గదిలోకి శవాన్ని తీసుకెళ్లి.. పెద్ద పాత్రలో ఉడికించాడు. అనంతరం తన పిల్లలతో కలిసి పారిపోయాడు. అయితే బాధితురాలి కుమార్తె ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందజేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే నర్గీస్ హత్యపై కచ్చితమైన కారణం లేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నర్గీస్ పిల్లల స్టేట్‌మెంట్ తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version