కేజీ మామిడిపండ్లు రూ. 2.5 లక్షలట.. పండించేది మన దేశంలోనే..!!

-

మామిడి పండ్ల సీజన్‌ వచ్చేసింది.. ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి పండిన రసాలు, బంగినపల్లి కాయలు వస్తున్నాయి. మన దగ్గర మామిడిపండ్ల కాస్ట్‌ కేజీ వంద నుంచి మూడు వందల లోపే ఉంటుంది.. కానీ కేజీ మామిడి పండ్లు 2.5. లక్షలంటే మీరు నమ్మగలరా..? అంత కాస్టా..? పంట వేసినవాళ్లకు పండగేగా అనుకుంటున్నారా..? ఇంతకీ ఇవి ఏం రకం మామిడిపండ్లు.. ఎందుకు అంత కాస్ట్‌..?

జపాన్‌కు చెందిన ‘మియాజాకి’ మామిడి అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటి. జపాన్‌లో ఈ మామిడి కిలో రూ.2.5 లక్షల వరకు అమ్ముడుపోయింది. అయితే మధ్యప్రదేశ్‌లో ఈ మామిడికాయ కిలో రూ.20,000 వరకు విక్రయిస్తున్నారు. అంటే ఒక్క మామిడికాయ దాదాపు రూ. 4 వేలు ఉంటోంది. ఇంకా హైలెట్‌ ఏంటంటే.. వీటిని మన దేశంలోనే పండిస్తున్నారట.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లను రాజస్థాన్ ఎడారిలో పండిస్తున్నారు.. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు నీటి కొరత ఉన్న ప్రాంతంలోనే పండుతుందట..

కోటకు చెందిన రైతు శ్రీకిషన్ సుమన్ ఎడారిలో మియాజాకి రకం మామిడి చెట్టును నాటాడు. నర్సరీలో మామిడి సాగును అభివృద్ధి చేస్తున్నాడు. గత ఐదు సంవత్సరాలుగా, అతను మియాజాకి మామిడి రకంలో పనిచేస్తున్నాడట… ఈ మొక్క మూడేళ్లుగా ఫలాలను ఇస్తుందట… ఇప్పటి వరకు శ్రీకిషన్ 50 మొక్కలు విక్రయించారు. ఇంకా 100 మొక్కలకు ఆర్డర్ ఉన్నట్లు తెలుస్తోంది.

కోట నగరానికి 10 కిలోమీటర్ల దూరంలోని గిర్ధర్‌పూర్ గ్రామానికి చెందిన శ్రీకిషన్ సుమన్ మియాజాకి అనే రకం మామిడి నర్సరీని సిద్ధం చేశాడు. 2019లో, 11వ తరగతి చదువుతున్న శ్రీకిషన్‌కు థాయ్‌లాండ్‌లోని ఒక పరిచయస్తుడు మూడు మియాజాకి మామిడి మొక్కలను బహుమతిగా ఇచ్చాడు. ఆయన తన నర్సరీలో జపనీస్ రకానికి చెందిన ఆ మూడు మొక్కలను నాటాడు. అవి కేవలం రెండు-మూడేళ్లలో ఫలాలను ఇవ్వడం ప్రారంభించాయి. ఇప్పటి వరకు శ్రీకిషన్ మూడు చెట్ల నుంచి 10 పండ్లను సేకరించాడు. ఒక పండు 200 నుండి 300 గ్రాముల బరువు ఉంటుందట.. పండిన మామిడి పండ్లను కుటుంబసభ్యులకు, బంధువులకు ఇచ్చాడు. పండ్లను విక్రయించే బదులు ఈ 3 మొక్కల నుంచి మరిన్ని మొక్కలను చేసి వాటిని విక్రయించడం ప్రారంభించాడు..

ఈ రకం మామిడి పండడానికి మంచి ఎండ నీరు అవసరం. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఫలాలను ఇస్తుందట. ఈ మామిడి పైన ఎరుపు రంగులో ఉంటుంది, కానీ లోపల పసుపు రంగులో ఉంటుంది. మియాజాకి మామిడి ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా పోషకమైనది. ఆరోగ్యానికి మేలు చేసే ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్, బీటా కెరోటిన్ వంటి పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. ఈ మామిడి పండు తొక్కను కూడా సులభంగా తినవచ్చని శ్రీకిషన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news