60 ఏళ్ల ఓ వృద్ధుడితో ఓ యువతి అక్రమ సంబంధం పెట్టుకుని… అతని ఖజానకు చెక్ పెట్టిన సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… రాజస్థాన్ లోని జైపూర్ కు సమీపంలోని సోదాల గ్రామంలో.. కమల్ కిషోర్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడి తండ్రి హుకుమ్ చంద్ కోసం గాయత్రి అనే యువతిని పనికి నియమించాడు. వ్యాపారం నిమితిత్తం అతడు వేరే ప్రాంతానికి వెళ్లి పోయాడు. అయితే ఇంట్లో ఉన్న ఆ వృద్ధుడి ఆస్తులపై పనిమనిషి గాయత్రి కన్ను పడింది.
వృద్ధుడితో అక్రమ సంబంధం పెట్టుకొని దానిని వీడియో తీసింది. వాటిని చూపించి ఆ వృద్ధుని బెదిరించింది. అతని ఆస్తి మొత్తం తన పేరుమీద రాయించుకుంది యువతి. ఇటీవల వృద్ధుడు ఉన్ముక్త్ చంద్ అనుకోకుండా మరణించాడు. అయితే కొంతకాలానికి తండ్రి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను పరిశీలించాలి.
అందులో గాయత్రి పేరు ఉండటంతో అతనికి ఏమీ అర్థం కాలేదు. దీనిపై గాయత్రిని ప్రశ్నించగా.. అతడిపై ఎదురు తిరిగింది. గట్టిగా మాట్లాడితే అతడి తండ్రి తో తాను సన్నిహితంగా ఉన్న వీడియోలను బయటపెడతానని హెచ్చరించింది. దాదాపు 80 లక్షలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేసింది. ఇక దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాయత్రి అరెస్టు చేశారు.