రేవంత్‌ రెడ్డికి ప్రశాంతత లేకుండా చేస్తున్నారు – విజయశాంతి

-

 

రేవంత్‌ రెడ్డికి ప్రశాంతత లేకుండా చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలపై విమర్శలు చేశారు విజయశాంతి. జాతీయ స్థాయిలో గాని, రాష్ట్రాల స్థాయిలో గానీ కాంగ్రెస్ పార్టీ పతనానికి ఇతర పార్టీలేవీ వ్యూహ ప్రతివ్యూహాలు పన్ని తలలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. ప్రత్యర్థి పార్టీలకు ఆ శ్రమ లేకుండా వారి తరఫున కాంగ్రెస్ నేతలే ఆ పనిని విజయవంతంగా చేసిపెడతారని చురకలు అంటించారు.


ఇందుకు అతిపెద్ద ఉదాహరణ తెలంగాణ కాంగ్రెస్ పార్టీయే… అంతర్గత తగాదాలతో నిత్యం కుమ్ములాడుకుంటూ… తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసమ్మతితో ముఖ్యమంత్రులకి నిద్రపట్టకుండా… అధికారం లేనప్పుడు పీసీసీ ప్రెసిడెంట్‌కి ప్రశాంతత లేకుండా చేస్తుంటారు. ఒకవేళ కాస్తో కూస్తో పార్టీ కోసం పని చేసేవారెవరైనా ఉంటే… ఆ నాయకుడు లేదా నాయకురాలు ఎక్కడ తమని మించి హైలైట్ అవుతారోనన్న భయంతో వారిని బయటకి పంపేవరకూ శాంతించరని పేర్కొన్నారు.

గత కొన్నేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని నిశితంగా గమనిస్తే, నేను చెప్పేవన్నీ అక్షర సత్యాలని అంగీకరించక తప్పదు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లోని పరిస్థితులను పరిశీలిస్తే, పీసీసీలోని పూర్వ టీడీపీ, ప్రస్తుత బీఆరెస్ అనుకూల సభ్యులు, చిరకాల కాంగ్రెస్ వాదుల మధ్య చిచ్చురేపి, రెచ్చగొట్టి, విభేదాలతో పార్టీని కుప్పకూల్చే పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నయి. తాజా కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయని విమర్శలు చేశారు విజయ శాంతి.

Read more RELATED
Recommended to you

Latest news