కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న పేరు. కరోనా అంటే ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. రోజురోజుకి ఈ వ్యాధి విస్తృతంగా విస్తరిస్తోంది. శ్వాసవ్యవస్థపై పంజా విసిరే ఈ సూక్ష్మజీవి ఇప్పటికే వేల మందిని ప్రాణాలను బలి తీసుకుంది. చైనాలోని ఉహాన్ అనే ప్రాంతంలో ఉన్న సముద్ర ఆహార మార్కెట్లో కరోనా వైరస్ మొదటగా వ్యాపించినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో వారి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు చేపట్టారు. దీంతో పరిశోధకులు వారికి కొత్త వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. దానికి కరోనా వైరస్ అని పేరు పెట్టారు. ఇదిలా ఉంటే కరోనా.. చికెన్ ద్వారా కూడా వ్యాపిస్తుందంటూ వచ్చిన ఓ వార్త తమిళనాడు ప్రజలను భయాందోళనకు గురిచేసింది. దీంతో వీరంతా చికెన్ జోలికి పోవాలంటేనే వణికిపోయారు. అయితే ఈ వార్తలన్నింటికీ కారణం వేరే ఉందని దర్యాప్తులో తేలగా షాక్ అయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కుడ్డలోర్లో ఓ 18ఏళ్ల యువకుడు తన మిత్రుడు నడిపే సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. తనకు ఫ్రీగా చికెన్ ఇవ్వాలని అడిగాడు. దీనికి సదరు మిత్రుడు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన యువకుడు ఆ సూపర్ మార్కెట్లో చికెన్ తింటే కరోనా సోకుతుందంటూ వాట్సాప్‌లో ప్రచారం చేశాడు. అక్కడి చికెన్ తిని తన మిత్రుడొకరు అనారోగ్యం పాలయ్యారని పేర్కొన్నాడు. ఈ వార్త ఆనోటా ఈనోటా పాకి తమిళనాడు ప్రజలను గజగజలాడించింది. చివరకు ఈ విషయం పోలీసులకు తెలియడంతో అసత్య ప్రచారం చేసిన యువకుడిని అరెస్ట్ చేసి విచారణ చేయగా తనకు ఫ్రీగా చికెన్ ఇవ్వలేదనే కోపంతోనే ఈ వార్త ప్రచారం చేసినట్లు నిందితుడు వెల్లడించాడు.