ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకోవడంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో వైయస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు షాక్ ఇవ్వడం జరిగింది.
ఇటువంటి తరుణంలో అమరావతి ప్రాంతంలో చంద్రబాబు హయాంలో భూసేకరణలో చేపట్టిన 1251 ఎకరాల భూములను ఇటీవల 50 వేల మందికి పైగా పేద వాళ్లకి ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని జగన్ సర్కార్ డిసైడ్ అయింది. అది కూడా సి.ఆర్.డి.ఏ చట్టం ప్రకారం. దీంతో ఈ విషయంపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో హైకోర్టు వేసిన ఓ ప్రశ్నకి జగన్ సర్కార్ వద్ద సమాధానం లేక తల పట్టుకున్నట్లు అయింది. విషయంలోకి వెళితే సీఆర్డీఏ చట్టం ప్రకారం అమరావతిని అభివృద్ధి చేసిన తర్వాత అందులో ఐదు శాతం భూముల్ని పేదల నివాస గృహాలకు వినియోగించాలన్నది చట్టం.
ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా ఇప్పుడే భూముల్ని ఎలా పంచుతారు..? …. రాజధాని ప్రాంతంలోని 1251 ఎకరాలను.. ఇళ్ల స్థలాలుగా ఇతర ప్రాంతాలక వారికి కేటాయిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు ధర్మానసం చేసిన వ్యాఖ్య ఇది. దీనికి అడ్వకేట్ జనరల్ వద్ద సమాధానం లేకపోయింది. అంతేకాకుండా రాజధాని ప్రాంతం పరిధిలో బయట వ్యక్తులకు ఇళ్ల స్థలాలు కేటాయించటం పట్ల హైకోర్టు వేసిన ప్రశ్నకు జగన్ సర్కార్ వద్ద జవాబు రాకుండా పోయింది. మొత్తం మీద హైకోర్టులో జగన్ సర్కార్ కి అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు కేటాయించే ఇళ్ల స్థలాల విషయంలో గట్టి షాకే తగిలింది.