హైదరాబాద్ లో ఫ్లెక్సీల కలకలం..ఏం అమిత్ షా..ఇవాళ తెలంగాణకు ఏం ఇస్తావ్.. !

-

కేంద్ర ప్రభుత్వంలో తొలిసారిగా ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ వేడుకలకు బీజేపీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు ముఖ్య అథితిగా హాజరుకానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. మువ్వన్నెల జెండాను ఎగరవేయనున్నారు.

శుక్రవారం రాత్రే ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక ఇవాళ ఉదయం 8.30 కి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ కి అమిత్ షా చేరుకోనున్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్న అమిత్ షా.. జాతీయ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. అయితే.. అమిత్‌ షా వచ్చిన నేపథ్యంలో.. హైదరాబాద్‌ బీజేపీకి వ్యతిరేకంగా.. ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

సెప్టెంబర్‌ 17న తెలంగాణకు ఏం ఇస్తావు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవి అంటూ.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గోవా లిబరేషన్ డే కు 300 కోట్లు ఇచ్చిన కేంద్రం..తెలంగాణ విమోచన దినం అని చెప్తూ ఎందుకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.. అమిత్ షా గారు తెలంగాణ కు ఈ రోజు ఏమైనా ఇస్తారా ప్రకటన చేస్తారా అంటూ పేరెడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో వెలిశాయి ఈ టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీ లు.

 

Read more RELATED
Recommended to you

Latest news