బ్రేకింగ్: తెలంగాణాలో వాక్సిన్ పై కీలక నిర్ణయాలు

-

తెలంగాణ రాష్ట్రం లో వాక్సినేషన్ ప్రక్రియలో కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. పని ప్రదేశాల్లో 18 ఏళ్ళు దాటిన వారికి వ్యాక్సినేషన్ నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ మేరకు ఆస్పత్రులతో పాటు… పని ప్రదేశాల్లో వాక్సినేషన్ వేయాలి అని నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సంస్థలు వాక్సినేషన్ కోసం ప్రైవేట్ ఆస్పత్రులతో కో ఆర్డినెట్ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

మరోవైపు ఈనెల 28 తరువాత సూపర్ స్ప్రెడర్స్ కి వాక్సినేషన్ చేసేందుకు ఆరోగ్య శాఖ సిద్దమవుతుంది. సూపర్ స్ప్రెడర్స్ లోకి షాప్ కీపర్స్, ఆటో డ్రైవర్లు, సెలూన్ , మెడికల్ షాప్స్, ఎక్కువ జనాలతో కాంటాక్ట్ అయ్యే వారందరికీ వాక్సినేషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 30లక్షల వరకు ఉంటారనే అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news