అధికబరువు, మలబద్ధకం, డయోరియాకు సింగిల్‌ సొల్యూషన్‌

-

ఇప్పుడు జనాలకు కామన్‌గా ఉండే సమ్యలేంట్రా అంటే.. అధికబరువు, మలబద్ధకం, నిద్రలేమి.. ఈ మూడు మనిషి జీవితంతో ఫుట్‌బాల్‌ ఆడేసుకుంటున్నాయి.. డబ్బు సమస్య, రిలేషన్‌ ప్రాబ్లమ్స్‌ ఎలాగూ అందరికీ ఉండేవే.. కానీ ఈ ఆనారోగ్య సమస్యలు కామన్‌గా ఉన్నా..మనం చేసే తప్పుల వల్లే ఇవి వస్తాయి. అయితే అధిక బరువు నుంచి విముక్తి పొందడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ సమస్యలకు ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే ఇసబ్‌గోల్ (Isabgol). ఈ మొక్క అచ్చం గోధుమలా కనిపిస్తుంది. ఇది చిన్న ఆకులు, పువ్వులు కలిగి ఉంటుంది. వీటి కంకులపై ఉండే విత్తనాలపై తెల్లటి రంగు పదార్థం ఒకటి అంటుకుంటుంది. ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయట..
ఇసబ్‌గోల్‌ని పిస్లియమ్ హస్క్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. నాచురల్ ఫైబర్‌గా పనిచేస్తుంది. వీటిని నీళ్లలో వేసి నానబెడితే.. కాసేపటికి జెల్లీలా మారుతాయి. సగ్గుబియ్యం, సబ్జా గింజల్లాగానే ఇవి కనిపిస్తాయి. ఇసబ్‌గోల్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే ముఖ్యంగా మూడు సమస్యలపై ఈ మొక్క అద్భుతంగా పోరాడుతోందని నిపుణులు అంటున్నారు.. నిత్యం ఇసబ్‌గోల్‌ని తీసుకుంటే.. మలబద్ధకం, డయేరియా, అధిక బరువు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది..
అధిక బరువుతో బాధపడుతున్న వారు ఇసబ్‌గోల్‌ని వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ ఇసబ్‌గోల్‌ని నీళ్లలో కలిపి.. లంచ్, డిన్నర్‌కు ముందు తీసుకోవాలి.. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే.. కొన్ని రోజుల్లో బరువు తగ్గుతారట..
ఇక బలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారు.. ఎసిడిటీ, గ్యాస్ వల్ల మూడు నాలుగు రోజులకోసారి మాత్రమే మల విసర్జనకు వెళ్తారు. అలాంటప్పుడు రెండు టేబుల్ స్పూన్‌ల ఇసబ్‌గోల్‌ని గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోయే ముందు తాగితే.. ఉదయాన్నే సుఖ విరేచనమవుతుంది.
డయేరియాకు కూడా ఇసబ్‌గోల్ చక్కగా పనిచేస్తుంది. కప్పు పెరుగులో రెండు టేబుల్ స్పూన్‌ల ఇసబ్‌గోల్ కలపాలి. భోజనం చేసిన తర్వాత.. దీనిని తీసుకుంటే.. డయేరియా సమస్య నుంచి బయటపడవచ్చు.
ఇవి మాత్రమే కాదు…ఇసబ్‌గోల్ మీ గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందట.. హృదయ సంబంధ రోగాలను రానీయదు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని పెరగనీయదు.
అంతా బానే ఉంది కానీ.. దీని పేరే పలకడానికి కష్టంగా ఉంది. అసలు ఇది మన దగ్గర దొరుకుతుందా అనే డౌట్‌ మీకు ఈపాటికే వచ్చి ఉండాలే.. ఈసబ్ ఎక్కడ దొరుకుతుందనే టెన్షన్ అవసరం లేదు. అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఇది అందుబాటులో ఉంది. సో..మీకు ఇంట్రస్ట్‌ ఉంటే వైద్యుల సలహా మేరకు తీసుకుని వాడండి.!

Read more RELATED
Recommended to you

Latest news