మహిళలు ఎందులో తక్కువ కాదని ఎప్పటికప్పుడు నిరుపిస్తూనే ఉన్నారు. అదిరిపోయే బిజినెస్ ల నుంచి, అంతరిక్షం వరకు మహిళలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే..సొంత వ్యాపారాలు చేసుకుంటున్న మహిళలు ఎందరో ఉన్నారు..మగవాళ్ళను మించి లాభాలాను కూడా పొందుతున్నారు..ఇప్పుడు మరో మహిళ కూడా న్యాచురల్ గా దొరికే వాటితో కొన్ని రకాల ఫుడ్ లను జనాలకు అందిస్తుంది.. ఇటు రైతులకు, అటు జనాలకు మంచి లాభాలను అందిస్తుంది.ఇప్పుడు ఆ మహిళ గురించి పూర్తీ వివరాలను తెలుసుకుందాం..
తమిళనాడులోని కరూర్ జిల్లా కరూర్ గ్రామంలో పుట్టిపెరిగింది 26 ఏళ్ల దీపిక రవి. చదువురీత్యా పట్నం వెళ్లినప్పటికి సెలవుల్లో గ్రామంలో ఉన్న ఇంటికి తప్పకుండా వచ్చేది. తండ్రితోపాటు పొలాల్లో తిరుగుతూ వ్యవసాయం ఎలా చేస్తారు, రైతులు ఎదుర్కొనే సమస్యలు, పంట.. పొలం నుంచి మార్కెట్‌కు చేరేనాటికి రైతుకు ఏ మాత్రం లాభం వస్తుందో తండ్రి ద్వారా తెలుసుకుంది.పంటలన్నీ రసాయన ఎరువులతో పండించడం వల్ల, స్వచ్ఛమైన ఆహారానికి బదులు రసాయనాలు తినాల్సి వస్తోందని గ్రహించింది. అప్పటినుంచి సేంద్రియ పద్ధతిలో పంటలు పండించి, వాటిని లాభసాటిగా మార్కెట్‌లో ఎలా అమ్మాలో తెలుసుకుంది.
మునగ ఆకు, కాయలతో మునగను పండించి, వారి దగ్గరే మునగ ఆకు, మునక్కాడలను కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఈ రెండింటితో రైస్‌మిక్స్, చట్నీ పొడి, ములగ టీ, ములగ క్యాప్యూల్స్, ములగ ఫేస్‌ప్యాక్స్, ఫేస్ స్క్రబ్స్, సబ్బులు, చర్మసంరక్షణ ఉత్పత్తులేగాక, ములగ హెయిర్ ఆయిల్, హెయిర్‌సిరమ్ వంటివాటిని కూడా తయారు చేసి విక్రయిస్తోంది.సేంద్రియ పద్ధతిలో పండిన మునగతో ఉత్పత్తులు తయారు చేయడం వల్ల గుడ్ లీఫ్‌కు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో మరిన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చేందుకు దీపిక ఉత్సాహంగా ముందుకు సాగుతోంది.భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది..అధిక లాభాలతో పాటు ఆరోగ్యం కూడా ఉండటం తో ఈమె ప్రోడక్ట్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది.