విశాఖ రాజధాని కోసం యువకుడు ఆత్మహత్యాయత్నం

-

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాజధాని అంశం చుట్టూ తిరుగుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఓవైపు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రైతులు పాదయాత్ర కొనసాగిస్తుండగా.. మరోవైపు ఉత్తరాంధ్రలో వికేంద్రీకరణకు అనుకూలంగా జేఏసీ కార్యాచరణ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గురువారం అనకాపల్లి జిల్లా చోడవరంలో వికేంద్రీకరణకు మద్దతుగా ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

విశాఖను రాజధానిని చేయాలంటూ ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికిి పాల్పడ్డాడు. శ్రీనివాసరావు అనే యువకుడు విశాఖను రాజధానిగా కొనసాగించాలని గంధవరం నుంచి చోడవరం యువకులు బైక్ ర్యాలీ చేపట్టగా.. మార్గమధ్యంలో జై విశాఖ అంటూ బైక్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను ఆత్మహత్యయత్నానికిి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. స్వల్పంగా గాయపడిన శ్రీనివాసరావుని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news