మునుగోడులో నకిలీ ఓటర్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బిజెపి

-

మునుగోడు ఉప ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ 25 వేల నకిలీ ఓటర్లను నమోదు చేసేందుకు ప్రయత్నిస్తోందని బిజెపి మొదటినుంచి ఆరోపిస్తూూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు కేంద్ర ఎన్నికల సంఘానికి మునుగోడు లో నకిలీ ఓటర్లను తొలగించాలని బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్, మాజీ శాసనమండలి సభ్యులు రామచంద్రరావు మాట్లాడుతూ.. గత ఉప ఎన్నికలలో 2000 ఓట్ల కన్నా ఎక్కువగా నమోదు కాలేదని.. కానీ ఈ ఉప ఎన్నికకు భారీగా నకిలి ఓటర్లను నమోదు చేశారని ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మునుగోడు లో ముఖం వేసి అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని.. అధికారులను, సామాన్యులను భయపెడుతున్నారని అన్నారు. దీనిపై తప్పకుండా ఎన్నికల కమిషన్ విచారణ జరుపుతుందని హామీ ఇచ్చారు తరుణ్ చుగ్. మునుగోడు లో తప్పకుండా బిజెపి గెలుస్తోందని జోష్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news