బిజినెస్ ఐడియా: శాండ్ విచ్ బిజినెస్ తో కోట్లు సంపాదిస్తున్న యువకుడు..

-

ఇప్పుడు యువత బిజినెస్ లు చేయడం పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభాలను అందుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు కూడా అదే పని చేస్తున్నారు. సొంతంగా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాడు.కోట్లు అందుకుంటూ యువతకు ఆదర్శంగా నిలిచాడు.అతని బిజినెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..

 

పూణేకు చెందిన హుస్సేన్ జుజర్ లోఖండ్ వాలా తనకు ఇష్టమైన పని చేస్తూ మంచి విజయం సాధించాడు. ఇప్పుడు ఏటా కోట్ల బిజినెస్ ను నడిపిస్తున్నాడు. ఎంబీఏ పూర్తి చేసి జాబ్ లో జాయిన్ అయ్యాడు. వ్యాపారస్థుల కుటుంబం నుండి వచ్చిన హుస్సేన్ లోఖండ్ వాలా.. తన తండ్రి బిజినెస్ ను స్వీకరించి దానినే నడపించడానికి ఏమాత్రం ఇష్టపడే వాడు కాదు. కానీ తన ఇంట్లో వాళ్లు మాత్రం హుస్సేన్ తమ కుటుంబ వ్యాపారాన్నే కొనసాగించాలని కోరుకునే వారు. హుస్సేన్ కు తనదైన వ్యాపారాన్ని ప్రారంభించి విజయవంతంగా నడిపించాలని కలలు కనే వాడు. కానీ ఏ రంగంలో వ్యాపారం ప్రారంభించాలో ఏ ఆలోచన లేదు.

శాండ్ విచ్ లు తయారు చేసి అమ్మాలనుకున్నాడు. పిజ్జా, బర్గర్ లు మార్కెట్ లో భారీ పోటీని ఇస్తాయని తనకు తెలుసు.అందుకే తన శాండ్ విచ్ లకు దేశీయ రుచి అందివ్వాలని నిర్ణయించుకున్నాడు. 2013లో పూణేలోని మగర్ పట్టాలో వాట్ ఏ శాండ్ విచ్ పేరుతో తన మొదటి అవుట్ లెట్ ను ప్రారంభించాడు. దీని కోసం రూ. 1.5 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. తన శాండ్ విచ్ లను సరసమైన ధరలకే అందివ్వాలని మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు హుస్సేన్. కేవలం రూ. 29 కే శాండ్ విచ్ అందిస్తున్నాడు. హుస్సేన తన మొదటి అవుట్ లెట్ ను ప్రారంభించినప్పుడు, అతను రెస్టారెంట్‌లో అన్ని పనులను స్వయంగా చేసాడు. శుభ్రపరచడం, ప్రిపరేషన్ చేయడం, పదార్థాలు, అలాగే కూరగాయలను తీసుకొని వాటిని తయారు చేస్తారు.

వాట్’ ఏ శాండ్‌విచ్’ కాన్సెప్ట్ ప్రజాదరణ పొందకముందే క్లౌడ్ కిచెన్‌గా పనిచేయడం ప్రారంభించింది. 2020 మహమ్మారి సంవత్సరంలో, అనేక రెస్టారెంట్లు మూసివేయబడినప్పుడు, క్లౌడ్ కిచెన్ స్పేస్‌లో వ్యాపారం విపరీతంగా పెరిగింది. 2021 వారు రాష్ట్ర సరిహద్దులను ఉల్లంఘించి, 50+ డెలివరీ కిచెన్‌లతో జాతీయ ఆటగాడిగా మారిన మరో మైలురాయి సంవత్సరం. 2022లో, ఈ సంఖ్యను 100 కిచెన్‌లకు తీసుకెళ్లి అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించాలని వారు భావిస్తున్నారు.. ఇంకా బ్రాంచులు పెట్టాలని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news