ఎంపీ నవనీత్ రాణా దంపతులపై పోలీసులు ఛార్జిషీట్.. ఎందుకంటే..?

-

ముంబై అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతుల కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ నెల 16వ తేదీన విచారణ జరగనుంది. ఇద్దరు నేతలకు ఈ రోజు బోరువాలి కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా.. వ్యక్తిగత కారణాల వల్ల హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. కాగా, ఐపీసీ సెక్షన్ 353 ప్రకారం.. నవనీత్ రాణా దంపతులపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.

ఎంపీ నవనీత్ రాణా
ఎంపీ నవనీత్ రాణా

అయితే, శివసేన పార్టీ అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం దగ్గర హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని నవనీత్ దంపతులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు దంపతులిద్దరినీ ఏప్రిల్ 23వ తేదీన అరెస్ట్ చేశారు. దేశ ద్రోహం కేసు, మరో రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే వీరికి మే 4వ తేదీన బెయిల్ మంజూరు కాగా.. మే 5వ తేదీన విడుదలయ్యారు. అయితే అరెస్ట్ సమయంలో పోలీసులు వేధింపులకు గురి చేశారని ఎంపీ నవనీత్ రాణా లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన స్పీకర్.. ప్రివిలేజెస్ కమిటీకి అప్పగించారు. దీంతో మహారాష్ట్ర ఉన్నతాధికారులు ఈ నెల 15వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news