అమీర్ ఖాన్ ఇంట్లో కరోనా కలకలం..!

ముంబైలో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండవం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో సామాన్యులు, సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డుతున్నారు. అయితే తాజాగా.. తన సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వెంటనే వారిందరినీ క్వారంటైన్ చేసినట్టు తెలిపారు. కుటుంబ సభ్యులందరికీ నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చిందని ఆమీర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

అయితే తన తల్లికి ఇంకా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. ఆమెకు నెగిటివ్ రావాల్సిందిగా భగవంతుడిని కోరుకోవాలంటూ అభ్యర్థించారు. ఇప్పటికే బాలీవుడ్‌లో చాలా మంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడ్డారు. సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ లాంటి వాళ్లు కరోనాతో చనిపోయారు కూడా. ఇదిలా ఉంటే మొన్నామధ్య బోనీ కపూర్ ఇంట్లో కూడా చాలా మందికి వైరస్ సోకింది.