బిగ్ బాస్ అభిజీత్ కి సర్జరీ..!

-

అభిజిత్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు పలు సినిమాల్లో నటించాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి ఫీల్ గుడ్ మూవీ తో హీరోగా వచ్చిన అభిజిత్ తర్వాత సినిమాలోని ఎంచుకోవడంలో తడబడ్డాడు. తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు పెళ్లిగోల అనే ఒక వెబ్ సిరీస్ చేశాడు. కంటెంట్ బాగానే ఉన్నా ప్రేక్షకులకి అది బాగా రీచ్ కాలేదు. బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొని కప్ గెలవడమే కాకుండా చాలా మంది ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నాడు.

బిగ్బాస్ కప్ కొట్టిన తర్వాత ఎందుకు ఆయన సినిమాలు కానీ వెబ్ సిరీస్ లో కానీ ఆసక్తి చూపించలేదు. చాలా కాలం గ్యాప్ తీసుకుని మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే ఒక యాంతోలజీ సిరీస్ లో చిన్న పాత్ర చేసాడు. ఇప్పుడు మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో చేస్తున్నాడు ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా కాలికి గాయమైన విషయాన్ని వెల్లడించారు. 2019లో చిన్న గాయం అయింది పెద్దగా పట్టించుకోలేదు అది ఇప్పుడు లిగమెంట్ టియర్ అయ్యే వరకు వచ్చిందని ప్రమోషన్స్ పూర్తయిక సర్జరీ కూడా చేయించుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు అభిజిత్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version