Acer 58 ఇంచుల 4k టీవీ ఫీచర్స్ మొదలైన వివరాలు మీకోసం..!

-

మీరు ఏదైనా మంచి స్మార్ట్ టీవీ ని కొనాలని అనుకుంటున్నారా..? అయితే మీరు Acer 58-అంగుళాల టీవీ గురించి చూడాల్సిందే. ఈ టీవీ మెరుగైన నిర్మాణ ప్రమాణాలను కలిగి ఉంది. అలానే పెద్ద స్క్రీన్ కలిగి వుంది ఇది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పైగా స్మార్ట్ టీవీ ధృడంగా వుంది. ఎక్కువ కాలం కూడా ఇది మన్నుతుంది.

 

ఈ టీవీ యొక్క వెనుక ప్యానెల్ హార్డ్ ప్లాస్టిక్‌తో రూపొందించబడింది. ఈ 58-అంగుళాల టీవీని కూడా వాల్-మౌంట్ చేయవచ్చు కానీ వాల్ మౌంట్ బ్రాకెట్‌ను విడిగా కొనుగోలు చేయాలి. అలానే ఈ టీవీ ప్యానెల్ ని అవసరమైన కనెక్టివిటీ పోర్ట్‌లతో ఫిక్స్ చేసారు. మూడు HDMI పోర్ట్‌లు మరియు రెండు USB పోర్ట్‌లను కలిగి ఇది వుంది.

మూడు HDMI పోర్ట్‌లలో ఒకటి ARCకి మద్దతు ఇస్తుంది. అయితే ఇది HDMI కేబుల్‌తో సౌండ్ సెటప్‌లకు డాల్బీ అట్మోస్ వంటి హై-డెఫినిషన్ ఆడియోను అవుట్‌పుట్ చేయడానికి అయ్యేలా చేస్తుంది. అదే విధంగా మీరు ఒక LAN పోర్ట్, ఆడియో కోసం ఆప్టికల్ 3.5mm అవుట్, మినీ AV ఇన్‌పుట్ పోర్ట్, యాంటెన్నా ఇన్‌పుట్ పోర్ట్ మరియు SPDIF వంటి ఇన్‌పుట్ పోర్ట్‌లను కూడా ఈ టీవీ ద్వారా పొందొచ్చు. కానీ ALLM మోడ్ మాత్రం లేదు.

ఇక ఈ టీవీ బ్రైట్‌నెస్‌ను చూస్తే.. డిస్‌ప్లే 420 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి వుంది. ఇక ఈ టీవీ సౌండ్ విషయానికి వస్తే.. 58-అంగుళాల టీవీ డాల్బీ ఆడియో కి ఈ టీవీ సపోర్ట్ ని ఇస్తుంది. కానీ 24W స్పీకర్ సెటప్ డెప్త్ మరియు క్వాలిటీ పరంగా కాస్త తగ్గింది.

ఇక ఈ టీవీ తాలూకా రిమోట్ కంట్రోల్ విషయానికి వస్తే.. స్మార్ట్ టీవీల కోసం మంచి రిమోట్ కంట్రోల్‌ని డిజైన్ చేసింది. ఎలాంటి ఇబ్బంది దీని వలన ఉండదు. అలానే ఈ టీవీ OTT ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఎలాంటి ప్లేబ్యాక్ సమస్యలు లేకుండా 4K ఫైల్‌లను స్ట్రీమింగ్ చేయగలదు. ఈ టీవీ కోడ్ నేమ్- rtd285oతో 64-బిట్ ARM కార్టెక్స్-A55 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. క్వాడ్-కోర్ చిప్‌సెట్ గరిష్టంగా 1100 MHz క్లాక్ స్పీడ్‌ని కలిగి ఉంది మరియు 2GB RAM మరియు 16GB మెమరీతో ఉందిది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news