కత్తి మహేశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..!

-

టాలీవుడ్ వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్ మ‌రోసారి వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీరాముడిపై ఫేస్ బుక్ లో అసభ్య కామెంట్లను పోస్ట్ చేశారంటూ గతంలో కత్తి మహేశ్ పై పలువురు వ్యక్తులతో పాటు, హిందూ సంఘాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసులతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. క‌త్తి మ‌హేష్ ను 153 A, 505 -1b, 505 -2 సెక్ష‌న్ల కింద అరెస్ట్ చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి హైకోర్టులో హాజరుపరిచారు.

కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. గతంలో పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేశారు. అలా పవన్ ఫ్యాన్స్, కత్తి మహేష్ మధ్య కొన్ని నెలల పాటు మాటల యుద్ధం జరిగింది. ఆయనపై హైదరాబాద్‌లో ఓసారి దాడి కూడా జరిగింది. అయితే ఆ దాడి చేసిన వారిపై  ఇంత‌వ‌ర‌కు ఎలాంటి అరెస్టులు, చ‌ర్య‌లు తీసుకోలేద‌ని క‌త్తి మ‌హేష్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news