ఏపీ అభివృద్ధే చంద్రబాబు బ్రాండ్…జగన్‌ దే చీప్‌ లిక్కర్‌ బ్రాండ్‌ : అచ్చెన్నాయుడు

-

ఏపీ అభివృద్ధే చంద్రబాబు బ్రాండ్…జగన్‌ దే చీప్‌ లిక్కర్‌ బ్రాండ్‌ అని అచ్చెన్నాయుడు కౌంటర్‌ ఇచ్చారు. మద్యం ఆదాయం ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసే దౌర్భ్యాగం ఈ రాష్ట్రంలో ఉందని..తండ్రిని చంపి.. తల్లికి అమ్మ ఒడి ఇస్తారా..? అని నిలదీశారు. మద్యం ద్వారా ఐదేళ్లల్లో రూ. 10 వేల కోట్లు ఆదాయం తాడేపల్లి ప్యాలెస్సుకు రావాలనే టార్గెట్ పెట్టుకున్నారని సీఎం జగన్ పై మండిపడ్డారు.

ఆ టార్గెట్టులో భాగంగానే మద్యం పాలసీని మార్చారని.. మద్యం తయారీ కంపెనీలన్నీ తన వద్దకు రావాలని.. ముడుపులు తీసుకునేందుకే మద్యం పాలసీ తెచ్చారని నిప్పులు చెరిగారు. దోపిడీ కోసం చేసిన పాలసీని గాంధీ జయంతి రోజున తెచ్చారని.. ప్రజల ప్రాణాల కోసం మాపై ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సీఎంతో పోరాటమంటే మామూలు విషయం కాదు.. అందుకే ప్రాణాలకు తెగించి పోరాడుతు న్నామన్నాని చెబుతున్నానని.. సీఎం జగన్ సభలో చెప్పినవన్నీ అవాస్తవాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం చంద్రబాబు పెట్టిన పథకాలను రద్దు చేసిన సీఎం జగన్.. చంద్రబాబు అనుమతించిన డిస్టలరీలను ఎందుకు రద్దు చేయలేదు..? అని నిలదీశారు. చంద్రబాబు అనుమతించిన డిస్టలరీలను జగన్ రద్దు చేయగలరా..?డిస్టలరీలు పేరుకే వేరే వాళ్లు నడుపుతున్నారు.. కానీ ఆ డిస్టలరీలన్నీ వైసీపీ నేతల బినామీల చేతుల్లోనే ఉన్నాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news