యాక్షన్ కింగ్‌ అర్జున్ సర్జాకు మాతృవియోగం

-

యాక్షన్ కింగ్ అర్జున్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి లక్ష్మీదేవమ్మ శనివారం రోజున కన్నుమూశారు. ఆమె వయస్సు 85 సంవత్సరాలు. మైసూర్‌లో ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

ప్రస్తుతం లక్ష్మీదేవమ్మ పార్థివదేహం బెంగుళూరులోని అపోలో ఆస్పత్రిలో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అర్జున్ సర్జాకు, ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. లక్ష్మీదేవమ్మ మృతిపట్ల సంతాపం ప్రకటించారు.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అర్జున్.. నెమ్మదిగా హీరో అయ్యారు. హీరోగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. పలుచిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన హీరో విశ్వక్ సేన్‌తో ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో అర్జున్ కుమార్తె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news