ఆధార్‌ కార్డుతో యూపీఐ ని ఇలా యాక్టివేట్ చేసుకోండి..!

-

యూపీఐ సేవలను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. క్యాష్ ట్రాన్సక్షన్స్ కంటే కూడా యూపీఐ సేవలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంటర్‌నెట్ ఛార్జీలు, స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావడం మూలాన యూపీఐ సేవలను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా యూపీఐ సేవలను వాడుతున్నారు. మీరు కూడా యుపిఐ సేవలను యాక్టివేట్ చెయ్యాలని అనుకుంటున్నారా…? అయితే కచ్చితంగా డెబిట్‌ కార్డ్‌ ఉండాలి అని అనుకుంటూ వుంటారు.

కానీ యూపీఐని యాక్టివేట్ చేసుకోవాలంటే ఆధార్ కూడా చాలు. మీరు డెబిట్ కార్డ్‌ లేకుండా ఆధార్‌ కార్డుతో కూడా యూపీఐని యాక్టివేట్ చెయ్యచ్చు. కానీ రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నెంబర్‌, బ్యాంకు ఖాతాకు లింక్‌ చేసే నెంబర్ ఒక్కటే అవ్వాలి. ఇక మరి ఎలా యాక్టివేట్ చెయ్యాలి అనేది ఇప్పుడు చూద్దాం.

ముందు మీరు ఏదైనా యూపీఐ యాప్‌ను ఓపెన్‌ చేయండి.
ఇప్పుడు ‘యాడ్‌ యూపీఐ ఐడీ’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోండి.
దీనిలో ‘ఆధార్‌ బేస్‌డ్‌ వెరిఫికేషన్‌’ను సెలెక్ట్ చేసి యాక్సెప్ట్‌ అండ్‌ అగ్రీ మీద నొక్కండి.
ఇప్పుడు మీ ఆధార్‌ కార్డులో మొదటి ఆరు నెంబర్లను ఎంటర్‌ చేయాలి.
ఇప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌కి ఓటీపీ వస్తుంది.
ఎంటర్ చేసేస్తే చాలు యూపీఐ యాక్టివేట్ అవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news